ఎర్రబెల్లి అరెస్ట్ అక్రమం: బీజేపీ నేత లక్ష్మణ్
వరంగల్ జిల్లా పాలకుర్తి సంఘటనలో ఎర్రబెల్లి దయాకరరావును అరెస్ట్ చేయడం పట్ల అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు లక్ష్మణ్ తప్పుపట్టారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అప్రజాస్వామిక పోకడలు పోతోందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి హితవు చెప్పారు. అక్కడ జరిగిన రాళ్ళ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొన్నారని, వారినెవరినీ అరెస్ట్ చేయకుండా ఒక్క తెలుగుదేశం పార్టీ వారినే అరెస్ట్ చేయడంలోనే ప్రభుత్వ కుట్ర అర్ధమవుతోందని ఆయన […]
Advertisement
వరంగల్ జిల్లా పాలకుర్తి సంఘటనలో ఎర్రబెల్లి దయాకరరావును అరెస్ట్ చేయడం పట్ల అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు లక్ష్మణ్ తప్పుపట్టారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అప్రజాస్వామిక పోకడలు పోతోందని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి హితవు చెప్పారు. అక్కడ జరిగిన రాళ్ళ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొన్నారని, వారినెవరినీ అరెస్ట్ చేయకుండా ఒక్క తెలుగుదేశం పార్టీ వారినే అరెస్ట్ చేయడంలోనే ప్రభుత్వ కుట్ర అర్ధమవుతోందని ఆయన ఆరోపించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ పథకం ప్రకారమే ఈ అరెస్ట్ జరిగినట్టు భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమ నిబంధనలన్నీ మరిచిపోయి వ్యవహరిస్తోందని, ప్రొటోకాల్ నిబంధనలను తుంగలోకి తొక్కుతుందని లక్ష్మణ్ అన్నారు. విపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుని వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసిన టీ-టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకరరావును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు.
Advertisement