​300 మంది డాక్టర్‌లను తొలగిస్తాం: కామినేని

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు మూడు వందల మంది డాక్టర్‌లు విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అవుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. విధులకు హాజరుకాని వైద్యులను సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. వీరు సరైన అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరవుతున్నారని, ప్రభుత్వ వైద్యులు తమ డ్యూటీ తర్వాత క్లినిక్‌లు నిర్వహించుకోవచ్చని, అయితే ఇన్ పేషంట్లను చేర్చుకోరాదని ఆయన అన్నారు. వైద్యులు ఎక్కడ క్లినిక్ నిర్వహించేది ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని శ్రీనివాస్ చెప్పారు. […]

Advertisement
Update:2015-09-27 06:45 IST
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు మూడు వందల మంది డాక్టర్‌లు విధులకు హాజరు కాకుండా గైర్హాజరు అవుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. విధులకు హాజరుకాని వైద్యులను సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. వీరు సరైన అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరవుతున్నారని, ప్రభుత్వ వైద్యులు తమ డ్యూటీ తర్వాత క్లినిక్‌లు నిర్వహించుకోవచ్చని, అయితే ఇన్ పేషంట్లను చేర్చుకోరాదని ఆయన అన్నారు. వైద్యులు ఎక్కడ క్లినిక్ నిర్వహించేది ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని శ్రీనివాస్ చెప్పారు. బాలింతల కోసం ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేయాలని ఆదేశించామని, వాటిలోనే బాలింతలను ఇంటికి చేర్చాలని నిర్ణయించామని కామినేని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News