లైంగిక ఆరోపణలపై సౌదీ యువరాజు అరెస్ట్!
సౌదీ యువరాజు మాజిద్ అబ్దుల్లాజీజ్ అల్ సోద్(28)ను లైంగిక ఆరోపణలతో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్ల రూపాయల బాండ్‌ను సమర్పించిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతుల్లో ఒకటైన అమెరికాలోని లాస్ఏంజెల్స్లోని బేవర్లీ హిల్స్ ఎన్‌క్లేవ్‌లో అద్దెకుంటున్న సౌదీ యువరాజు మాజిద్ అక్కడ పనిచేసే మహిళా వర్కర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మహిళ తీవ్ర హింసకు గురైంది. రక్తమోడుతూ అరుస్తున్న […]
Advertisement
సౌదీ యువరాజు మాజిద్ అబ్దుల్లాజీజ్ అల్ సోద్(28)ను లైంగిక ఆరోపణలతో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 2 కోట్ల రూపాయల బాండ్‌ను సమర్పించిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతుల్లో ఒకటైన అమెరికాలోని లాస్ఏంజెల్స్లోని బేవర్లీ హిల్స్ ఎన్‌క్లేవ్‌లో అద్దెకుంటున్న సౌదీ యువరాజు మాజిద్ అక్కడ పనిచేసే మహిళా వర్కర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మహిళ తీవ్ర హింసకు గురైంది. రక్తమోడుతూ అరుస్తున్న ఆమె పరిస్థితిని పోలీసులకు అక్కడున్న ఒకరు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించారు. ఘనటకు కారణమైన యువరాజును అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అక్కడి చట్టాల ప్రకారం యువరాజుకు దౌత్య రక్షణలు ఉండవు. అరెస్టు అనంతరం దాదాపు రూ. 2 కోట్ల బాండ్‌ను కోర్టుకు సమర్పించి ఆయన విడుదలైయ్యాడు. కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 19న యువరాజు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
Advertisement