మండవా... టీడీపీలో ఉండవా?
ఎందుకో తెలీదు కాని గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మండవ వెంకటేశ్వరరావు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను మంచి పేరుంది. ఎన్టీఆర్‌తోపాటు రాజకీయాల్లో కలిసి నడిచిన ఆయన… పార్టీలో మంచి అనుభవజ్ఞుడు. మంత్రిగా ఆయన కీలక శాఖలను నిర్వహించిన అనుభవం అపారం. పార్టీ వ్యూహాలు రూపొందించడంలోను, ప్రభుత్వ విధానాలు అమలు చేయడంలోను ఆయనకు ఆయనే సాటి అని టీడీపీలో సీనియర్లు కూడా చెబుతుంటారు. అధికారం కోసం ఆరాటపడడం […]
Advertisement
ఎందుకో తెలీదు కాని గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత మండవ వెంకటేశ్వరరావు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను మంచి పేరుంది. ఎన్టీఆర్‌తోపాటు రాజకీయాల్లో కలిసి నడిచిన ఆయన… పార్టీలో మంచి అనుభవజ్ఞుడు. మంత్రిగా ఆయన కీలక శాఖలను నిర్వహించిన అనుభవం అపారం. పార్టీ వ్యూహాలు రూపొందించడంలోను, ప్రభుత్వ విధానాలు అమలు చేయడంలోను ఆయనకు ఆయనే సాటి అని టీడీపీలో సీనియర్లు కూడా చెబుతుంటారు. అధికారం కోసం ఆరాటపడడం ఆయనకు అలవాటు లేదు. అందుకే ఆయన ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడాలన్న థ్యాస కలగలేదు. అందుకే ఆయన పార్టీలోనే ఉంటూ నేనూ ఉన్నాననిపించుకునే విధంగా అప్పుడప్పుడూ తెలుగుదేశం కార్యాలయంలో కనబడతారు. గత ఎన్నికల్లో పోటీ చేయించాలని ఎంత ప్రయత్నించినా చంద్రబాబు మాటను సున్నితంగా తిరస్కరించి తన శిష్యుడైన నర్సారెడ్డికి నిజామాబాద్ రూరల్ స్థానాన్ని త్యాగం చేశారు. రాష్ట్రం విడిపోవడం… తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉండడం… రాజకీయాలకు విసిగిపోవడం… ఈ కారణాలన్నీ ఆయన్ని రోజురోజుకూ పార్టీకి దూరం చేస్తున్నాయని వినికిడి. ఇప్పటి రాజకీయాలకు తను సరిపోననుకుంటున్నారో… తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం అని భావిస్తున్నారో గాని మండవ హైదరాబాద్‌లోనే ఉంటున్నా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తనకు రాజకీయ వారసులు ఎవరూ లేరని, నిజంగా ఎవరైనా రావాలనుకుంటున్నా వద్దనే సలహా ఇస్తానని మండవ వెంకటేశ్వరరావు తన సన్నిహితుల వద్ద అంటున్నారంటే ప్రస్తుత రాజకీయాల పట్ల ఆయన ఎంత విసిగిపోయారో తెలుస్తూనే ఉంది. బహుశా రాజకీయ నిష్కృమణకు ఇక టీడీపీలో నుంచి బయటికి వెళ్లడం ఒక్కటే ఆయన మార్గంలో మిగిలి ఉన్నట్టు కనిపిస్తోంది.
Advertisement