ప్రత్యేక హోదాపై జగన్‌ దీక్ష వాయిదా

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదాపై శనివారంనుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేశారు. దీక్షపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని, అనుమతి వచ్చేవరకు దీక్షను వాయిదా వేస్తున్నామని ఆ పార్టీ ప్రతినిధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వం కుటిలనీతితో దీక్షను అడ్డుకుందని ఆయన ఆరోపించారు. దీక్షకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ అనుకూల నిర్ణయం రాలేదు. దీక్షపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌తో కాకుండా మామూలుగా పిటిషన్‌ వేయాలని హైకోర్టు సూచించింది. […]

Advertisement
Update:2015-09-25 11:44 IST
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదాపై శనివారంనుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేశారు. దీక్షపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని, అనుమతి వచ్చేవరకు దీక్షను వాయిదా వేస్తున్నామని ఆ పార్టీ ప్రతినిధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వం కుటిలనీతితో దీక్షను అడ్డుకుందని ఆయన ఆరోపించారు. దీక్షకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ అనుకూల నిర్ణయం రాలేదు. దీక్షపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌తో కాకుండా మామూలుగా పిటిషన్‌ వేయాలని హైకోర్టు సూచించింది. దీంతో ప్రస్తుతం తలపెట్టిన దీక్షను విరమిస్తున్నట్టు పెద్దిరెడ్డి ప్రకటించారు. జగన్మోహనరెడ్డి దీక్షకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలివ్వవలసిందిగా కోరుతూ తాము సోమవారం హైకోర్టులో మరో పిటిషన్‌ వేయనున్నట్టు పెద్దిరెడ్డి తెలిపారు.
Tags:    
Advertisement

Similar News