వనజాక్షే దాడి చేశారని చింతమనేని ఆరోపణ
ఇసుక వివాదంలో కృష్ణా జిల్లా ముసునూరు తాహసిల్లారు వనజాక్షిదే తప్పని విచారణ సంఘం ముందు విప్, తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఆమె డ్వాక్రా మహిళపై దాడి చేసి తనపైనే వారు దాడి చేసినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. దాడికి గురైనట్టు చెబుతున్న వనజాక్షి డ్వాక్రా మహిళలపై దాడి చేశారని ప్రభాకర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఏర్పడిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. దీనికి సీనియర్ ఐఎఎస్ అదికారి జెసి శర్మ ఆద్వర్యం […]
Advertisement
ఇసుక వివాదంలో కృష్ణా జిల్లా ముసునూరు తాహసిల్లారు వనజాక్షిదే తప్పని విచారణ సంఘం ముందు విప్, తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఆమె డ్వాక్రా మహిళపై దాడి చేసి తనపైనే వారు దాడి చేసినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. దాడికి గురైనట్టు చెబుతున్న వనజాక్షి డ్వాక్రా మహిళలపై దాడి చేశారని ప్రభాకర్ ఆరోపించారు. ఈ ఘటనపై ఏర్పడిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. దీనికి సీనియర్ ఐఎఎస్ అదికారి జెసి శర్మ ఆద్వర్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రబాకర్ మాట్లాడుతూ తన తప్పు ఉందని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం ఒక కుట్ర అని ఆయన ఆరోపించారు. వనజాక్షి తనకు సంబంధం లేని ఇసుక రేవులోకి వచ్చారని ఆయన అన్నారు. కాగా వనజాక్షి అంతకుముందు కమిటీకి తన వాదన వినిపిస్తూ ఎమ్మెల్యే చింతమనేని తన అనుచరులతో వచ్చి దాడి చేశారని, ఇందులో తాను తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వాదనలు విన్న శర్మ తన నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారు.
Advertisement