మందుబాబులకు రాజేంద్రుడి పాఠాలు
మద్యం తాగి వాహనాలు నడపొద్దాన్నారు ‘మా’అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్. హైదరాబాద్ గోషామహల్లో డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన మందు బాబులకు పాఠాలు చెప్పారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అనర్ధాలను ఆయన సవివరంగా వారికి తెలిపారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమయిపోయాయో కొన్ని ఉదాహరణలను ఆయన వివరించారు. తాగితే కిక్కు వస్తుందన్నది నిజం కావచ్చు కాని క్షణికమైన కిక్ కోసం నూరేళ్ళ జీవితాలు నాశనమై పోతాయని, దురదృష్టం వెంటాడితే ప్రాణాలే పణంగా […]
Advertisement
మద్యం తాగి వాహనాలు నడపొద్దాన్నారు ‘మా’అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్. హైదరాబాద్ గోషామహల్లో డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన మందు బాబులకు పాఠాలు చెప్పారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వచ్చే అనర్ధాలను ఆయన సవివరంగా వారికి తెలిపారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమయిపోయాయో కొన్ని ఉదాహరణలను ఆయన వివరించారు. తాగితే కిక్కు వస్తుందన్నది నిజం కావచ్చు కాని క్షణికమైన కిక్ కోసం నూరేళ్ళ జీవితాలు నాశనమై పోతాయని, దురదృష్టం వెంటాడితే ప్రాణాలే పణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే తాగుడుకు స్వస్తి చెప్పాలని, ఒకవేళ తాగాలనిపిస్తే ఇంటికెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగవచ్చని, అంతేకాని తాగి రోడ్లపై డ్రైవింగ్ చేయడం వల్ల మీతోపాటు రోడ్డుపై ఉండే ప్రతి ఒక్కరికి ప్రమాదం పొంచి ఉన్నట్టేనని ఆయన అన్నారు.
Advertisement