స్టేషన్‌లోనే మందు కొట్టి స్టెప్పులేసిన భామ!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మహిళలే దొరికితే మొగం చూపించడానికి సిగ్గు పడతారు… కనీసం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి కేసు పెట్టవద్దంటూ పోలీసులను ప్రాధేయపడతారు. కాని సునీతా యాదవ్‌ అనే ఓ యువతి తాగి… రోడ్లపై తెగ హడావిడి చేసి… పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక కూడా అంతకన్నా ఎక్కువ చేసి ముంబయి పోలీసులకు రాత్రివేళ కూడా ముచ్చెమటలు పట్టించింది. తాను స్టేషన్‌లో ఉన్నానని, చుట్టూ పోలీసులున్నారని కూడా భయపడకుండా తెగ హడావిడి చేసింది. రాత్రి సమయం కావడం… […]

Advertisement
Update:2015-09-21 20:32 IST
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మహిళలే దొరికితే మొగం చూపించడానికి సిగ్గు పడతారు… కనీసం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి కేసు పెట్టవద్దంటూ పోలీసులను ప్రాధేయపడతారు. కాని సునీతా యాదవ్‌ అనే ఓ యువతి తాగి… రోడ్లపై తెగ హడావిడి చేసి… పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక కూడా అంతకన్నా ఎక్కువ చేసి ముంబయి పోలీసులకు రాత్రివేళ కూడా ముచ్చెమటలు పట్టించింది. తాను స్టేషన్‌లో ఉన్నానని, చుట్టూ పోలీసులున్నారని కూడా భయపడకుండా తెగ హడావిడి చేసింది. రాత్రి సమయం కావడం… అందులో ఎక్కువ మంది మహిళ పోలీసు సిబ్బంది లేకపోవడంతో… మహిళ చేస్తున్న హంగామాకు ఏం చేయాలో అర్ధం కాక పోలీసులు ప్రేక్షకులై పోయారు. అప్పటికే ఫుల్‌గా మందు కొట్టి ఉన్న మహిళ… స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే గటగటా బీరు బాటిల్ ఎత్తి తాగేసింది. ఈ సీన్ చూసి పక్కనున్న మగాళ్లు సైతం లొట్టలేసుకుంటూ విస్తుపోయారు. ఆ తర్వాత తాగిన మైకంలో పోలీస్ స్టేషన్‌లోనే స్టెప్పులేస్తూ రచ్చరచ్చ చేసింది… తర్వాత ‘నేను ఓ వీవీఐపిని… నన్నే అరెస్ట్ చేస్తారా’ అంటూ గొడవకు దిగింది. తాగి చిందు లేస్తున్న అమ్మడిని తట్టుకోలేక… చివరకు భామ మత్తు దించేందుకు మహిళా పోలీసులను విధుల్లోకి దించాల్పి వచ్చింది. ముంబయి భామ వ్యవహరించిన తీరు మాత్రం పోలీసులనే విస్తుపోయేట్టు చేసింది. ఇలాంటి ఆడాళ్లు ఇలా కూడా ఉంటారా అనిపించేట్టు చేసింది.
Tags:    
Advertisement

Similar News