మహిళల గురించి కొన్ని సంగతులు... సరదాగా!
అలారాన్ని ఉదయం నిద్రలేవాల్సిన సమయం కంటే పది నిమిషాల ముందుగానే సెట్ చేసుకుంటారు. అలారం మోగిన వెంటనే లేవకుండా పది నిమిషాలు బద్ధకించినా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు. మొబైల్ ఫోన్ ను చాలా సౌకర్యంగా హ్యాండ్‌బ్యాగ్‌లోకి తోసేస్తారు.. కాల్ వచ్చిన తర్వాత ఫోన్ మోగుతున్నంత సేపూ దానిని వెతకడానికే సరిపోతుంది. ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా దాస్తారు. కానీ ఆ దాచింది ఎక్కడో మరిచిపోతారు. అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం పెద్ద పని. అద్దంలో చూసుకున్న చాలా […]
Advertisement
- అలారాన్ని ఉదయం నిద్రలేవాల్సిన సమయం కంటే పది నిమిషాల ముందుగానే సెట్ చేసుకుంటారు. అలారం మోగిన వెంటనే లేవకుండా పది నిమిషాలు బద్ధకించినా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు.
- మొబైల్ ఫోన్ ను చాలా సౌకర్యంగా హ్యాండ్‌బ్యాగ్‌లోకి తోసేస్తారు.. కాల్ వచ్చిన తర్వాత ఫోన్ మోగుతున్నంత సేపూ దానిని వెతకడానికే సరిపోతుంది.
- ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా దాస్తారు. కానీ ఆ దాచింది ఎక్కడో మరిచిపోతారు. అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం పెద్ద పని.
- అద్దంలో చూసుకున్న చాలా సందర్భాల్లో ఇలా ఒక ఫొటో తీసుకుంటే బావుణ్ను అనుకుంటారు.
- ఎంత హడావుడిలో ఉన్నా ఇంటికితాళం వేయడం మర్చిపోరు. తాళం వేసి బ్యాగ్‌లో వేసుకున్న రెండు నిమిషాల్లోనే తాళాన్ని బ్యాగ్‌లో వేశానా లేదా అని ఓసారి చెక్ చేసుకుంటారు.
- బాత్‌రూమ్‌లో షాంపూ, సబ్బులు రెండు రకాలైనా లేకపోతే శాటిస్‌ఫాక్షన్ ఉండదు.
- అద్దం ముందు ఎంత సేపు నిలబడి తయారయినా సరే … బయటకు వెళ్లే ముందు మరోసారి తమను తాము అద్దంలో చూసుకోవడం మర్చిపోరు.
- వార్డ్‌రోబ్ లో దుస్తులు… తలుపు తీస్తే కిందకు జారిపడేటంతటి నిండుగా ఉంటాయి. వాటి ఎదురుగా నిలబడి ఈ రోజు ధరించడానికి ఒక్కటీ సరైన డ్రస్ లేదని అసంతృప్తిగా ముఖం పెడతారు.
- కొత్త ప్రదేశానికి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లేటప్పుడు… మలుపు తిరగాల్సిన చోట కచ్చితంగా నిర్ధారించుకోకుండా ముందుకెళ్లరు. అలాగే ప్రయాణదూరం తగ్గుతుంది కదాని అడ్డదారుల్లో ప్రయాణించడానికి ఇష్టపడరు. దారి పొరబడతామేమోనని భయంతో దూరమైనా సరే ప్రధాన రహదారుల్లో ప్రయాణించడానికే ఇష్టపడతారు.
- కుటుంబానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోవడానికి మగవాళ్లు వెనుకడుగు వేసి పారిపోవడానికి సిద్ధమైన సందర్భాల్లో మహిళలు ధైర్యంగా దానిని పరిష్కరించే వరకు నిలబడగలుగుతారు. కానీ చిన్న కీటకాలు, ఎలుకల వంటివి కనిపించినా, ఒంటికి తగిలినా విపరీతంగా భయపడతారు.
- మూడు రోజుల పర్యటనకు కనీసం ఏడు జతలైనా సర్దుతారు. అత్యవసరానికి ఒక జత ఎక్కువ పెట్టుకోవడం ఒక పద్ధతి. మిగిలిన మూడు జతలూ ఎప్పుడు ఏవి వేసుకోవాలనిపిస్తాయో లేదోననే బెంగతోనే.
ఇది ఒక్క మనదేశానికే కాదు… ప్రపంచంలోని అన్ని దేశాల మహిళల మీద చేసిన అనేక రకాల అధ్యయనాల ద్వారా తెలిసిన సంగతులివి.
Click to Read:
Advertisement