శ్రీవారి బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముతూ ఎమ్మెల్యే అనుచరుల అరెస్ట్‌

తిరుమలలో శ్రీవారి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందే దళారి అవతారం ఎత్తి భక్తులకు అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఈ అంశంపై ఓ కన్నేసి ఉంచారు. దాంతో ఈ ముఠా మొత్తం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యే సుగుణమ్మ లెటర్‌ హెడ్‌పై వీరు టిక్కెట్లు తీసుకుని బ్లాక్‌లో విక్రయిస్తున్నప్పుడు వీరు పట్టుబడ్డారు. వీరికి అధికారికంగా […]

Advertisement
Update:2015-09-13 17:10 IST
తిరుమలలో శ్రీవారి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందే దళారి అవతారం ఎత్తి భక్తులకు అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఈ అంశంపై ఓ కన్నేసి ఉంచారు. దాంతో ఈ ముఠా మొత్తం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. ఎమ్మెల్యే సుగుణమ్మ లెటర్‌ హెడ్‌పై వీరు టిక్కెట్లు తీసుకుని బ్లాక్‌లో విక్రయిస్తున్నప్పుడు వీరు పట్టుబడ్డారు. వీరికి అధికారికంగా సహకరిస్తున్న పాకాల హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యచంద్రరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని పట్టుకున్నప్పుడు మరో ముగ్గురు తప్పించుకు పారిపోయారు. ఎమ్మెల్యే అనుచరులుగా వీరు టిక్కెట్లు అమ్ముకుంటున్నారా? మరెవరయినా వీరితో టిక్కెట్లు అమ్మిస్తున్నారా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యచంద్రరావు వీరికి సహకరిస్తున్నందుకుగాను 70 వేల రూపాయలు డిమాండు చేసినట్టు ఆరోపణలున్నాయి.
Tags:    
Advertisement

Similar News