గోవధకు పాల్పడితే చర్యలు: ఎస్పీ
గోవధకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, బక్రీద్ రోజున అసలు ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని మెదక్ ఎస్పీ సుమతి హెచ్చరించారు. సంగారెడ్డిలో ఆమె మాట్లాడుతూ గోవధ మహా పాపమని, ఎవరైనా వాహనాల్లో గోవులను తరలిస్తే సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. పశువుల తరలింపును అరికట్టేందుకు కోహీర్, రంగధాంపల్లి, ముత్తంగి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అవసరమైతే 17 తర్వాత జిల్లాలో మరో 9 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. 17 నుంచి జరుగనున్న […]
Advertisement
గోవధకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, బక్రీద్ రోజున అసలు ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని మెదక్ ఎస్పీ సుమతి హెచ్చరించారు. సంగారెడ్డిలో ఆమె మాట్లాడుతూ గోవధ మహా పాపమని, ఎవరైనా వాహనాల్లో గోవులను తరలిస్తే సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. పశువుల తరలింపును అరికట్టేందుకు కోహీర్, రంగధాంపల్లి, ముత్తంగి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అవసరమైతే 17 తర్వాత జిల్లాలో మరో 9 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. 17 నుంచి జరుగనున్న వినాయక నవరాత్రోత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు. మండపాల పేరిట లక్కీ డ్రాలు, జూదం, డబ్బు వసూళ్లకు పాల్పడరాదని, మద్యం తాగరాదని, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలక పాల్పడవద్దని హెచ్చరించారు.
Advertisement