వర్శిటీల్లో మొబైల్ పోలీస్ పహారా: గంటా
ప్రతి యూనివర్సిటీలో ఐదుగురు పోలీసులతో మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామని, విశ్వవిద్యాలయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా సీఎస్, డీజీపీ సహా ప్రభుత్వం అప్రమత్తమయ్యేలా టెక్నాలజీ తీసుకువస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలో ప్రారంభించిన అభయ ఐక్లిక్ యాప్‌ను త్వరలో అన్ని వర్సిటీల్లో ప్రవేశపెట్టనున్నట్లు గంటా చెప్పారు. నాగార్జున యూనివర్శిటీలో పలు మార్పులు చేశామని ఆయన తెలిపారు. ఇన్‌చార్జి వీసీగా ఉదయలక్ష్మీని నియమించిన తర్వాత చేపట్టిన చర్యలపై మంత్రి గంటా సమీక్షించారు. రిషితేశ్వరి ఘటనలో బాధ్యులపై […]
Advertisement
ప్రతి యూనివర్సిటీలో ఐదుగురు పోలీసులతో మొబైల్ వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామని, విశ్వవిద్యాలయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా సీఎస్, డీజీపీ సహా ప్రభుత్వం అప్రమత్తమయ్యేలా టెక్నాలజీ తీసుకువస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖలో ప్రారంభించిన అభయ ఐక్లిక్ యాప్‌ను త్వరలో అన్ని వర్సిటీల్లో ప్రవేశపెట్టనున్నట్లు గంటా చెప్పారు. నాగార్జున యూనివర్శిటీలో పలు మార్పులు చేశామని ఆయన తెలిపారు. ఇన్‌చార్జి వీసీగా ఉదయలక్ష్మీని నియమించిన తర్వాత చేపట్టిన చర్యలపై మంత్రి గంటా సమీక్షించారు. రిషితేశ్వరి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చర్యలు ఆలస్యమవడంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. రిషితేశ్వరి ఘటనతో అన్ని వర్సిటీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. పాఠశాలలు సక్రమంగా లేకపోతే ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటికి ఒకే రంగు వేస్తామని, త్వరలో ఉపాధ్యాయుల భర్తీని చేపడతామన్నారు.
Advertisement