ఆకులు నాకే చైనా చెంతకు కేసీఆర్‌... పొన్నం

చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. పరిస్థితుల్ని ఎదుర్కోవడం కోసం తమ ఉత్పత్తుల రేట్లను కూడా తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తమ దేశ కరెన్సీని 30 శాతం డీ వాల్యు చేశారు. అలాంటి దేశానికెళ్ళి ఏం సాధిద్దామని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఓ పాయింట్‌ లేవనెత్తారు. చైనా ఇలాంటి దుస్థితిలో ఉండడం వల్లే ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఇంక అక్కడ నుంచి ఏం పెట్టుబడులు […]

Advertisement
Update:2015-09-08 11:15 IST
చైనా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. పరిస్థితుల్ని ఎదుర్కోవడం కోసం తమ ఉత్పత్తుల రేట్లను కూడా తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తమ దేశ కరెన్సీని 30 శాతం డీ వాల్యు చేశారు. అలాంటి దేశానికెళ్ళి ఏం సాధిద్దామని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఓ పాయింట్‌ లేవనెత్తారు. చైనా ఇలాంటి దుస్థితిలో ఉండడం వల్లే ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఇంక అక్కడ నుంచి ఏం పెట్టుబడులు తెద్దామని ఈయన బయలుదేరారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు రైతులు వందల సంఖ్యల్లో ఆత్మహత్యలు చేసుకుంటుంటే… రానుపోను ఖర్చుల కింద విమానానికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టే పెద్దమనిషికి ఆ నిధులతో రైతులను ఉపశమనం పొందేలా చేయవచ్చని తెలీదా అని నిలదీశారు. కేసీఆర్‌ పర్యటన చూస్తే ‘ఆకులు నాకే వాడింటికి మూతులు నాకేవాడెళ్ళాడ’న్న సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. ఫాం హౌస్‌లో సాగు చేస్తున్నానని చెప్పుకుని ఈ దొరగారికి సామాన్య రైతు కష్టాలు ఏం తెలుస్తాయని పొన్నం విమర్శించారు.
Tags:    
Advertisement

Similar News