ఎందుకండీ... మమ్మల్ని భయపెడతారు: కోటంరెడ్డి
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపాయి… అంతేకాకుండా ఆయన మాటలు విన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందపడ్డారు. మాట్లాడితే మీ కధ చూస్తాం.. మీ అంతు తేలుస్తాం అని తమ పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు బెదిరిస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారని… అన్నారు. ఏమి చేస్తారండి మమ్మల్ని… గోదావరిలోకి తీసుకువెళ్లి నీళ్ళలో ముంచి చంపేస్తారా? గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి […]
Advertisement
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్ధతను ఎత్తి చూపాయి… అంతేకాకుండా ఆయన మాటలు విన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందపడ్డారు. మాట్లాడితే మీ కధ చూస్తాం.. మీ అంతు తేలుస్తాం అని తమ పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు బెదిరిస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారని… అన్నారు. ఏమి చేస్తారండి మమ్మల్ని… గోదావరిలోకి తీసుకువెళ్లి నీళ్ళలో ముంచి చంపేస్తారా? గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి ఎలుకలతో కొరికించి చంపుతారా? లేదంటే నారాయణ కాలేజీలో చేర్పించి ర్యాగింగ్‌తో భయపెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా?తహశీల్దార్ వనజాక్షిని కొట్టినట్లు రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తారా? ఇవేమీ కాకపోతే గోదావరి జిల్లాలకు తీసుకువెళ్లి అక్కడ ఇంజెక్షన్లు ఇచ్చే సైకోతో మత్తు మందు ఇచ్చి చంపేస్తారా? అని వ్యంగ్యంగా అన్నారు. పుష్కర తొక్కిసలాట, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరికి ఒక బాలుడు మరణించడం, తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో సిరంజీ సైకో గొడవ వీటన్నిటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీధర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తమను ఏమైనా చేసేయడానికి ఇది ఎన్.టి.ఆర్. ట్రస్ట్ భవన్ కాదు. శాసనసభ అని శ్రీదర్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో మీరు నిజాయితీపరులైతే చర్చకు ఎందుకు రారు? అని ప్రశ్నించారు.
Advertisement