నారాయణ్‌ఖేడ్‌పై జగ్గారెడ్డి కన్ను!
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. అయితే.. ఈ స్థానంపై పోటీకి జగ్గారెడ్డి ఆసక్తి కనబరుస్తోన్నట్లు సమాచారం. ఆగస్టు 24న కిష్టారెడ్డి ఎస్ ఆర్ నగర్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే! సెప్టెంబరు 1న జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో ఉంటే ఆదరణ ఉండదని గ్రహించిన జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ చెంతకు […]
Advertisement
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. అయితే.. ఈ స్థానంపై పోటీకి జగ్గారెడ్డి ఆసక్తి కనబరుస్తోన్నట్లు సమాచారం. ఆగస్టు 24న కిష్టారెడ్డి ఎస్ ఆర్ నగర్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే! సెప్టెంబరు 1న జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో ఉంటే ఆదరణ ఉండదని గ్రహించిన జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ చెంతకు చేరారు. ఇప్పుడు కిష్టారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంపై జగ్గారెడ్డి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులు పోటీ చేసే సందర్భంలో టీఆర్ఎస్ పోటీ పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు గానీ, జగ్గారెడ్డికి టికెట్ ఇస్తే.. మాత్రం.. తప్పకుండా హోరాహోరీ పోటీ తప్పదు. అంగబలం, అర్ధబలం ఉన్న జగ్గారెడ్డి పోటీకి దిగితే.. టీఆర్ఎస్- కాంగ్రెస్ పోరు భీకరంగా ఉంటుందన్నడంలో సందేహం లేదు..
Advertisement