సొంతకాళ్ళపై నడవని టీడీపీ ప్రభుత్వం: సీఆర్
ఆంద్రప్రదేశ్‌లో జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కాళ్లు, మోడీ గడ్డం పట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇపుడు కూడా సొంత కాళ్ళపై నడవడం లేదని, ఒక కాలు బీజేపీది, మరోకాలు పవన్ కల్యాణ్‌ది పెట్టుకుని మనుగడ సాగిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సీ రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, కరువును విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనమండలిలో కరవుపై మాట్లాడుతూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీనికి అదికార […]
Advertisement
ఆంద్రప్రదేశ్‌లో జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ కాళ్లు, మోడీ గడ్డం పట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇపుడు కూడా సొంత కాళ్ళపై నడవడం లేదని, ఒక కాలు బీజేపీది, మరోకాలు పవన్ కల్యాణ్‌ది పెట్టుకుని మనుగడ సాగిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సీ రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, కరువును విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. శాసనమండలిలో కరవుపై మాట్లాడుతూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీనికి అదికార పక్ష సభ్యులు అడ్డుపడినప్పుడు ఆయన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చిందో విశ్లేషిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తిప్పికొట్టారు. తమకు ఎవరి వల్ల ఓట్ల శాతం పెరగలేదని అన్నారు. చంద్రబాబు సీనియారిటీ ఉపయోగపడిందని, దానికి ఇతర అంశాలు, పవన్ కళ్యాణ్ వంటివారు ఇచ్చిన సహకారం ఉపయోగపడిందని అన్నారు.
Advertisement