బీజేపీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా?
తెలంగాణ ప్రభుత్వ విధానాలపైన విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డికి మాటకుమాట సమాధానం చెప్పేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో శాంత్రి భధ్రతలు క్షీణించాయని, ఉగ్రవాదాన్ని తెలంగాణ ప్రభుత్వం అరికట్టడం లేదంటూ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఘాటైన జవాబిచ్చింది. దేశంలో ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీతో అంటకాగుతున్నది ఎవరు ? అని కిషన్‌రెడ్డికి చురకలంటించింది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కిషన్‌రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కిషన్‌రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వ విధానాలపైన విమర్శలు చేస్తున్న కిషన్‌రెడ్డికి మాటకుమాట సమాధానం చెప్పేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో శాంత్రి భధ్రతలు క్షీణించాయని, ఉగ్రవాదాన్ని తెలంగాణ ప్రభుత్వం అరికట్టడం లేదంటూ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఘాటైన జవాబిచ్చింది. దేశంలో ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీతో అంటకాగుతున్నది ఎవరు ? అని కిషన్‌రెడ్డికి చురకలంటించింది. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కిషన్‌రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కిషన్‌రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు.
కిషన్‌రెడ్డికి సంధించిన ప్రశ్నలు ఇవే?
1. కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పాక్ జెండా ఎగురవేసినా నోరు మెదపని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీఎఫ్)తో అంటకాగుతున్నది ఎవరు?
2. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్నదనే విషయం జగమెరిగిన సత్యమని… ఈ నేపథ్యంలో ఆ దేశానికి మద్దతునిస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కాదా?
3. మీ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది కనుకనే.. మా ప్రభుత్వంపై నిందలేస్తున్నారు ఇది నిజంకాదా?
4. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలేవీ కిషన్‌రెడ్డికి కనిపించడం లేదా..?
5. చంద్రబాబు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటు వాటా ఇవ్వకుండా కుట్రలు చేస్తుంటే.. ఎప్పుడైనా ప్రశ్నించారా..?
6. రైల్వే బడ్జెట్ సహా అన్ని విషయాల్లో కేంద్రం తెలంగాణకు ఆర్థికంగా ఊతమివ్వకున్నా.. అధిష్ఠానంపై ఎందుకు ఒత్తిడి తేలేదు?
7. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మీ కళ్లకు ఎందుకు కనిపించడం లేదు?
8. మీ విమర్శలన్నీ గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే తప్ప తెలంగాణపై మీకు ప్రేమ ఉందా?
కిషన్‌రెడ్డి సమాధానం చెప్తారా?
ఓటుకు నోటు కేసు, తెలంగాణ కరెంటు, కేంద్ర నిధులలో కలిసిపోరాడుదామన్న టీఆర్ఎస్ పిలుపుపై వెనకడుగు వేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా? అంటే.. ఆయన చెప్పలేడని.. బాబు చేతిలో కీలుబొమ్మ అని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు.
Advertisement