రాజధానికి ఐదు లక్షల కోట్లు ఖర్చు:బాబు

ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయని, వాటి నుంచి తేరుకోవాలంటే కొన్నేళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై విధానసభకు వివరణ ఇస్తూ చంద్రబాబు మరోసారి రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం పెద్దలు అడ్డదిడ్డంగా విభజించారని, 59 శాతం జనాభా ఉన్న ఏపీకి 47 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. ఆస్తులను భౌగోళికంగా పంచారని, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచారని తెలిపారు. విభజన అనంతరం […]

Advertisement
Update:2015-09-01 09:07 IST
ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయని, వాటి నుంచి తేరుకోవాలంటే కొన్నేళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై విధానసభకు వివరణ ఇస్తూ చంద్రబాబు మరోసారి రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం పెద్దలు అడ్డదిడ్డంగా విభజించారని, 59 శాతం జనాభా ఉన్న ఏపీకి 47 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. ఆస్తులను భౌగోళికంగా పంచారని, అప్పులు జనాభా ప్రాతిపదికన పంచారని తెలిపారు. విభజన అనంతరం రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇప్పటి వరకు 2 వేల కోట్లు ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు రావని ఆయన చెప్పారు. హైదరాబాద్ లాంటి రాజధానిని నిర్మించుకోవాలంటే సుమారు 20 ఏళ్లు పడుతుందని అన్నారు. రూ. 5 లక్షల కోట్ల దాకా ఖర్చవుతుందని బాబు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రూ.1500 కోట్లు సరిపోవని తాను కేంద్రానికి చెప్పానని తెలిపారు. నూతన రాజధానికి ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేసి, గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు లోపించాయని, ఈ విషయం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళానని బాబు తెలిపారు. ఉమ్మడి రాజధానిలో ఒకరిపై మరొకరు పెత్తనం చేయడానికి వీల్లేదని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కులు కాపాడేందుకు ముందుండేది తెలుగుదేశం పార్టీయేనని బాబు స్పష్టం చేశారు. సెక్షన్ 8 కాకుండా హోదా ఒక్కటే వైసీపీకి కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. దీన్నిబట్టి ప్రతిపక్షం సభ్యుల ఆలోచనలు ఎంత దివాళాకోరుతనంగా ఉన్నాయో అర్థమవుతుందని చంద్రబాబు మండిపడ్డారు. కేవలం ప్రత్యేక హోదానే కాదు అన్ని హక్కుల కోసం పోరాడాలని చంద్రబాబు సూచించారు.
నీటి సమస్యలు జఠిలం
రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై చంద్రబాబు నాయుడు చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంతవరకూ నీటిని విడుదల చేయలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పామని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తాయని చంద్రబాబు అన్నారు. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుందామని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చిద్దామని తెలంగాణ ప్రభుత్వంతో చెప్పామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని బాబు అన్నారు.
Tags:    
Advertisement

Similar News