అక్రమ కట్టడాలపై ముందు అధ్యయనం: కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టణాలు, లే అవుట్లపై ముందు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చేయడమా లేదా క్రమబద్దీకరించడమా అన్న అంశాలపై అధికారులు అన్ని కోణాల్లో అధ్యయనం జరపాలని సచివాలయంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అధికారులు రూపొందించే ప్రణాళిక వల్ల భవిష్యత్‌లో భూఆక్రమణలు పునరావృతం కాకూడదని, కబ్జాదారులకు గుండెలో రైళ్లు పరిగెత్తాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని […]
Advertisement
హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టణాలు, లే అవుట్లపై ముందు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చేయడమా లేదా క్రమబద్దీకరించడమా అన్న అంశాలపై అధికారులు అన్ని కోణాల్లో అధ్యయనం జరపాలని సచివాలయంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అధికారులు రూపొందించే ప్రణాళిక వల్ల భవిష్యత్‌లో భూఆక్రమణలు పునరావృతం కాకూడదని, కబ్జాదారులకు గుండెలో రైళ్లు పరిగెత్తాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సలహాదారు పాపారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తదితర్లు పాల్గొన్నారు.
Advertisement