ప్రత్యేక హోదాపై నీ వైఖరేమిటి బాబూ...
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్న ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలమా..వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రత్యేక హోదా కోసమా..లేక పదవిని కాపాడుకోవడానికా అని సూటిగా రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై రాజకీయ పార్టీల్లోనే కాకుండా ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయని, దీనిపై తక్షణం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లోపలికి పోతే […]
Advertisement
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్న
ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకూలమా..వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రత్యేక హోదా కోసమా..లేక పదవిని కాపాడుకోవడానికా అని సూటిగా రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై రాజకీయ పార్టీల్లోనే కాకుండా ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయని, దీనిపై తక్షణం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు లోపలికి పోతే ఆయన పదవి ఊడుతుందని, అందువల్ల తన పదవి ఉంటే చాలు .. రాష్ర్టానికి ప్రత్యేక హోదా లేకపోయినా ఫర్వాలేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తోందని రోజా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడిని చంద్రబాబు ఇప్పటికి ఎన్నిసార్లు కలిశారు? ఆయనకు ఏమని వినతులు చేశారో చెప్పాలని, వాటన్నిటిపైనా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని రోజా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు అనుకూలమా? వ‌్యతిరేకమా? ప‌్రత్యేక హోదా రాకపోతే టీడీపీ మంత్రులు ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతారా? వైదొలగుతారా? అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులను బయటకు పంపుతారా..? కొనసాగిస్తారా.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల లోపు ఏపీకి కేంద్రం చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఇపుడు 15 నెలలు దాటుతున్నా వాటిపై చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని రోజా ప్రశ్నించారు. దోచుకున్న డబ్బుతోనే తెలుగుదేశం పార్టీ అండమాన్ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగుతోందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అధికారం చేపట్టిన పదిహేను నెలల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు.
Advertisement