మాకిష్టం లేదు... మీరిమ్మంటే ఇస్తాం: వపన్‌తో రైతులు
ప్రభుత్వాన్ని నమ్మి తాము భూములు ఇవ్వలేమని, మీరు మాకు హామీ ఇస్తే, మా తరఫున నిలబడతామని వాగ్దానం చేస్తే భూములివ్వడానికి సిద్దమేనని పెనుమాక రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేశారు. బలవంతంగా మాత్రం భూములు లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. భూ సేకరణ అంటూ ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని, ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దత లేదని వారన్నారు. రైతుల పక్షాన పవన్ కల్యాణ్ నిలబడి హామీ ఇస్తే… తమ భూములను ఇస్తామని కొంతమంది రైతులు […]
Advertisement
ప్రభుత్వాన్ని నమ్మి తాము భూములు ఇవ్వలేమని, మీరు మాకు హామీ ఇస్తే, మా తరఫున నిలబడతామని వాగ్దానం చేస్తే భూములివ్వడానికి సిద్దమేనని పెనుమాక రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేశారు. బలవంతంగా మాత్రం భూములు లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. భూ సేకరణ అంటూ ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని, ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దత లేదని వారన్నారు. రైతుల పక్షాన పవన్ కల్యాణ్ నిలబడి హామీ ఇస్తే… తమ భూములను ఇస్తామని కొంతమంది రైతులు స్పష్టం చేశారు. తమవి బీడు భూములని మంత్రులు, అధికారులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో బతకలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ స్వచ్ఛందంగా భూములు ఇవ్వలేదని, భయపెట్టి భూములను లాక్కున్నారని వారన్నారు. 33 వేల ఎకరాల భూసేకరణ చేసినట్టు చెబుతున్నారని, అంతభూమి సరిపోదా అని రైతులు ప్రశ్నించారు. తమ భూములను బలవంతంగా లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాలన పవన్ నిలబడాలని కోరారు. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ కింద తమ భూములను లాక్కుంటుందని నిడమానూరుకు చెందిన ఓ మహిళా రైతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలిపింది. తన తండ్రి చనిపోతూ తనకు రెండు ఎకరాల భూమి ఇచ్చారని… కష్టపడి సాగుచేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ.. రెండెకరాల భూమిని 30 ఎకరాలు చేశామని ఆమె చెప్పారు. కష్టపడి సంపాదించుకున్న భూమిని ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు తమ 30 ఎకరాల భూమి రూ. 30 కోట్ల విలువ చేస్తుందని, అలాంటి భూమిని తయారు చేయలేమని, ప్రభుత్వానికి భూమి ఇవ్వడం ఇష్టం లేదని ఆమె అన్నారు. మాకు న్యాయం చేస్తామని చెబితే భూమి ఇస్తామని మహళా రైతు పవన్‌తో స్పష్టం చేశారు.
Advertisement