కొడంగల్‌లో ఏం జరుగుతోంది?
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ సాధారణ నియోజకవర్గం మే 31 తరువాత ఒక్కసారిగా ఇప్పుడు తెలంగాణలో అందరినోటా నానుతోంది. ఓటుకు నోటు కుంభకోణం కేసులో ఆ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌తో కొడంగల్‌కే పరిమితమయ్యారు రేవంత్‌రెడ్డి. కేసు కారణంగా ఆయన నియోజకవర్గంమీద దృష్టి పెట్టే అవకాశం చిక్కింది. అయితే టీఆర్ ఎస్ పార్టీ అక్కడ టీడీపీని బలహీన పరిచేలా ఆపరేష్ ఆకర్ష్ ప్రారంభించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి […]
Advertisement
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ సాధారణ నియోజకవర్గం మే 31 తరువాత ఒక్కసారిగా ఇప్పుడు తెలంగాణలో అందరినోటా నానుతోంది. ఓటుకు నోటు కుంభకోణం కేసులో ఆ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌తో కొడంగల్‌కే పరిమితమయ్యారు రేవంత్‌రెడ్డి. కేసు కారణంగా ఆయన నియోజకవర్గంమీద దృష్టి పెట్టే అవకాశం చిక్కింది. అయితే టీఆర్ ఎస్ పార్టీ అక్కడ టీడీపీని బలహీన పరిచేలా ఆపరేష్ ఆకర్ష్ ప్రారంభించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి దాకా త మ పార్టీ కార్యకర్తలను టీఆర్ ఎస్ బలవంతంగా పార్టీ మార్చేస్తోందని మండిపడుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది గురువారం మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా బయటపడింది. మార్కెట్ ప్రారంభోత్సవానికి రేవంత్‌రెడ్డికి పిలుపురాలేదు. దీంతో మంత్రి కన్నా ముందే ఆయన అక్కడికి చేరుకున్నారు. జూపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వారి కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రేవంత్‌రెడ్డితోపాటు అతని అనుచరులను అరెస్టుచేశారు. రేవంత్ ఆగ్రహానికి తమ పార్టీ నేతల టీఆర్ ఎస్‌లోకి వలస వెళ్లడమే కారణంగా తెలుస్తోంది. తాజాగా ఓ ఎంపీపీతోపాటు మండలస్థాయిలో కీలకంగా ఉన్న ముగ్గురు నేతలు టీఆర్ ఎస్‌లో చేరారు. పార్టీని కేడర్‌ను కాపాడుకునేందుకు ఓ వైపు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తోంటే..మరోవైపు టీఆర్ ఎస్ వలసల్ని ప్రోత్సహించడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అసలేయువనేత ఆయన ఎందుకు ఊరుకుంటారు. సరిగ్గా గురువారం మంత్రి జూపల్లి సందర్భంగా కావాల్సినంత రచ్చ చేసి మరోసారి అరెస్టయి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. కొడంగల్లో టీడీపీ నేతలను, కేడర్‌ను కాపాడుకోవడం రేవంత్‌రెడ్డికి కత్తి మీద సాములా మారింది.
Advertisement