పాలమూరు పల్లె దత్తతకు 'శ్రీమంతుడు' సుముఖం!
పుట్టి పెరిగిన ఊరును బాగు చేయాలన్న చక్కటి సందేశంతో ఇటీవల విడుదలైన మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమాను చూసి తమ తమ గ్రామాలకు ఏదో చేయాలన్నతపన ప్రతివారిలో కలిగించిందన్నది వాస్తవం. సినిమా హీరో మహేశ్ బాబు మాత్రం అంతటితో ‘ఆగడు’ అనిపించుకున్నాడు. సినిమాలో యువతకు ఇచ్చిన సందేశాన్ని తాను కూడా పాటిస్తానంటూ ‘దూకుడు’ ముందుకు వచ్చాడు. నిత్యం కరవుతో అల్లాడుతూ ఉండే మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను గ్రామజ్యోతి కార్యక్రమం కింద […]
Advertisement
పుట్టి పెరిగిన ఊరును బాగు చేయాలన్న చక్కటి సందేశంతో ఇటీవల విడుదలైన మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమాను చూసి తమ తమ గ్రామాలకు ఏదో చేయాలన్నతపన ప్రతివారిలో కలిగించిందన్నది వాస్తవం. సినిమా హీరో మహేశ్ బాబు మాత్రం అంతటితో ‘ఆగడు’ అనిపించుకున్నాడు. సినిమాలో యువతకు ఇచ్చిన సందేశాన్ని తాను కూడా పాటిస్తానంటూ ‘దూకుడు’ ముందుకు వచ్చాడు. నిత్యం కరవుతో అల్లాడుతూ ఉండే మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను గ్రామజ్యోతి కార్యక్రమం కింద దత్తత తీసుకునేందుకు ఈ ‘ఒక్కడు’ సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఇటీవల ఈ సినిమాను చూసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు.. బుధవారం మహేశ్‌బాబుకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక పల్లెను దత్తతకు తీసుకోవాలని కోరారు. దీనికి ‘రాజకుమారుడు’ సానుకూలంగా స్పందించాడు. ఇదే అంశంపై ట్విటర్‌లో స్పందించిన మహేశ్‌బాబు.. బాగా వెనుకబాటుకు గురైన మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తతకు తీసుకోవాలని ఆయన (మంత్రి కేటీఆర్) సూచించారు. నేను సిద్ధమని చెప్పాను. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని పేర్కొన్నాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్.. తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని మహేశ్ చెప్పాడు.
Advertisement