ఉడుము కోసం వెళ్లి.. ఇరుక్కుపోయాడు!
ఉడుమును పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఘటన ఇది. నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు రాళ్ల మధ్య ఇరుక్కుని దాదాపు 5 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. మద్నూర్ మండలం పెద్ద శక్కర్ల గ్రామానికి చెందిన హన్మండ్లు (15) పశువుల కాపరి. ఆదివారం రాత్రి తనకు కనబడిన ఉడుమును పట్టుకునే ప్రయత్నంలో అది రాళ్ల మధ్య దూరింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో హన్మండ్లు కూడా రాళ్ల మధ్య దూరేందుకు ప్రయత్నించాడు. ఉడుము మరింత లోపలికి […]
Advertisement
ఉడుమును పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఘటన ఇది. నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు రాళ్ల మధ్య ఇరుక్కుని దాదాపు 5 గంటలపాటు నరకయాతన అనుభవించాడు. మద్నూర్ మండలం పెద్ద శక్కర్ల గ్రామానికి చెందిన హన్మండ్లు (15) పశువుల కాపరి. ఆదివారం రాత్రి తనకు కనబడిన ఉడుమును పట్టుకునే ప్రయత్నంలో అది రాళ్ల మధ్య దూరింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో హన్మండ్లు కూడా రాళ్ల మధ్య దూరేందుకు ప్రయత్నించాడు. ఉడుము మరింత లోపలికి వెళ్లింది. హన్మండ్లు రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. బయటికి రాలేక కేకలు పెట్టడంతో స్నేహితులు వచ్చి తీసేందుకు ప్రయత్నించాడు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వారు ఊరిలోకి వెళ్లి గ్రామస్తులను తీసుకువచ్చారు. వారు వచ్చి హన్మండ్లును తీసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు పొక్లెయిన్‌ను తీసుకువచ్చి బండరాళ్లను తొలగించి రాళ్ల మధ్య చిక్కుకున్న హన్మండ్లును వెలికి తీశారు. బాలుడిని బయటికి తీసిన తరువాత వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యలు తెలిపారు.
Advertisement