మేస్ట్రో ఇళయరాజాకు అస్వస్థత!
సినీ సంగీత దిగ్జజం, స్వరాల రారాజు మేస్ట్రో ఇళయరాజా (72) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై సమాచారం లేదు. దీనిపై చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. ఆయనకు ఎలాంటి తీవ్ర అనారోగ్యం లేదని మాత్రం తెలిసింది. ఇళయరాజా ఆరోగ్యపరిస్థితిపై సమాచారం లేకపోవడంతో […]
Advertisement
సినీ సంగీత దిగ్జజం, స్వరాల రారాజు మేస్ట్రో ఇళయరాజా (72) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై సమాచారం లేదు. దీనిపై చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. ఆయనకు ఎలాంటి తీవ్ర అనారోగ్యం లేదని మాత్రం తెలిసింది. ఇళయరాజా ఆరోగ్యపరిస్థితిపై సమాచారం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 1943లో తమిళనాడు రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. 1976లో అన్నక్కలి (చిలుక) అనే సినిమాతో ఇళయరాజా సంగీత దర్శకుడిగా అవతరించారు. 39 ఏళ్ల సినీప్రస్థానంలో ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సైతం దక్షిణాది సినీరంగంలో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదిస్తున్నారు. ఇళయరాజా భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు.
Advertisement