హోదా ఇవ్వం... జగన్‌ లేఖకు కేంద్రం ప్రతిస్పందన

ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని ప్రకటించింది. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీకి న్యాయం చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్మోహనరెడ్డి రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి జగన్‌కు ఈ లేఖ అందింది. ప్రత్యేక హోదా వస్తేనే తమ శాఖ […]

Advertisement
Update:2015-08-15 07:53 IST
ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని ప్రకటించింది. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీకి న్యాయం చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్మోహనరెడ్డి రాసిన లేఖకు ప్రతిస్పందనగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి జగన్‌కు ఈ లేఖ అందింది. ప్రత్యేక హోదా వస్తేనే తమ శాఖ నుంచి కూడా రాయితీలు వస్తాయని, లేకుండా అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీని కూడా చూస్తామని ఈ శాఖ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా రాదన్న విషయం ఇంత స్పష్టంగా కేంద్రం చెబుతుంటే తెలుగుదేశం నాయకులు ఇంకా కల్లబొల్లి కబుర్లు ఎందుకు చెబుతున్నారని ఎంపీ మిధున్‌రెడ్ఇ ప్రశ్నించారు. హోదాపై చంద్రబాబు ఎందుకు నేరుగా మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉందా అని ఎంపీ మధున్‌రెడ్డి ప్రశ్నించారు. తమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నుంచి లేఖ వచ్చిన విషయాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి స్వయంగా చెప్పారు.
Tags:    
Advertisement

Similar News