ప్రత్యేక హోదాపై పక్కదోవ పట్టిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ విమర్శించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్‌సీపీ ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ప్రజలను ఏమార్చే విధగా ఉందని అన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా విషయంలో మార్గదర్శకాలు అనుమతించవని చంద్రబాబు చెబుతున్నారని, ప్రత్యేక ప్యాకేజీ వైపు ప్రజల దృష్టి మరల్చాలని […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ విమర్శించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్‌సీపీ ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాక చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ప్రజలను ఏమార్చే విధగా ఉందని అన్నారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా విషయంలో మార్గదర్శకాలు అనుమతించవని చంద్రబాబు చెబుతున్నారని, ప్రత్యేక ప్యాకేజీ వైపు ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని అన్నారు. విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి 5 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారని ధర్మాన గుర్తు చేశారు. “కాంగ్రెస్, బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాయి. ఇపుడు ఆ హామీలను అమలు చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం. ఈ విషయంలో రాజీకి ఎలాంటి తావూ లేదు.” అని ధర్మాన వ్యాఖ్యానించారు. విభజనతో ఏపీకి జరిగే నష్టాన్ని పూడ్చడానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల గురించి ఆలోచించుకోవాలి కానీ… చంద్రబాబు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు.. అని ఆయన ప్రశ్నించారు. కేసుల గురించే చంద్రబాబు భయపడుతున్నారు అని ధర్మాన ఎద్దేవా చేశారు. అందుకే ఆయన కేంద్రం అంటే భయపడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ మాత్రమే అని అరుణ్‌జైట్లీ అన్నపుడు తెలుగుదేశం ఎంపీలు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ధర్మాన ప్రశ్నించారు.
Advertisement