నీటిపారుదల క్యాంపు కాలనీలకు విద్యుత్ మీటర్లు
నీటి పారుదల క్యాంపు కాలనీలకు ఇకపై ఉచిత విద్యుత్ ఉండదు. ఇప్పటి వరకూ హైటెన్షన్ విద్యుత్‌ను ఉచితంగా ఉపయోగిస్తున్న నీటిపారుదల క్యాంపు కాలనీలను లోటెన్షన్ లైన్ల పరిధిలోకి మార్చి ప్రతి ఇంటికీ మీటరు అమర్చాలని, ప్రతి నెల విద్యుత్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ సమీక్షాసమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామ్‌సాగర్, ఎస్ఎల్‌బిసి, ఎఎమ్ఆర్ ప్రాజెక్టులోని ఇళ్లకు కొత్తవిధానంలోనే విద్యుత్ మీటర్లు అమర్చినట్లు కాలనీలకు ఇకపై […]
Advertisement
నీటి పారుదల క్యాంపు కాలనీలకు ఇకపై ఉచిత విద్యుత్ ఉండదు. ఇప్పటి వరకూ హైటెన్షన్ విద్యుత్‌ను ఉచితంగా ఉపయోగిస్తున్న నీటిపారుదల క్యాంపు కాలనీలను లోటెన్షన్ లైన్ల పరిధిలోకి మార్చి ప్రతి ఇంటికీ మీటరు అమర్చాలని, ప్రతి నెల విద్యుత్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ సమీక్షాసమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామ్‌సాగర్, ఎస్ఎల్‌బిసి, ఎఎమ్ఆర్ ప్రాజెక్టులోని ఇళ్లకు కొత్తవిధానంలోనే విద్యుత్ మీటర్లు అమర్చినట్లు కాలనీలకు ఇకపై రాష్ట్రంలోని కూడా విద్యుత్ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ కాలనీలకు సంబంధించిన విద్యుత్ బకాయిలను పవర్ డిస్కమ్‌లకు చెల్లించాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు.ఇకపై ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత మాత్రమే నీటిపారుదలశాఖ చూస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Advertisement