కారు నుంచి రూ.కోటి 50లక్షల నగదు స్వాధీనం

కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంకులో దొంగతనం చేసి కారులో ఉంచిన రూ.కోటి 50 లక్షల నగదును నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అబ్దుల్‌ రషీద్‌ విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బీజాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.కోటి 50 లక్షలు దొంగతనం జరిగింది. అక్కడి నేరస్థులను పట్టుకొని విచారించగా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ పార్కింగ్‌లోని కారులో (ఫోర్ట్‌ కెఏ28ఎన్‌9119) నగదు భద్రపర్చినట్లు తెలిపారని చెప్పారు. ఈ మేరకు నగదు […]

;

Advertisement
Update:2015-08-07 06:51 IST
కారు నుంచి రూ.కోటి 50లక్షల నగదు స్వాధీనం
  • whatsapp icon
కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంకులో దొంగతనం చేసి కారులో ఉంచిన రూ.కోటి 50 లక్షల నగదును నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అబ్దుల్‌ రషీద్‌ విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బీజాపూర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.కోటి 50 లక్షలు దొంగతనం జరిగింది. అక్కడి నేరస్థులను పట్టుకొని విచారించగా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ పార్కింగ్‌లోని కారులో (ఫోర్ట్‌ కెఏ28ఎన్‌9119) నగదు భద్రపర్చినట్లు తెలిపారని చెప్పారు. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News