నా కుమారుడిని క్షమించండి: నావెద్ తండ్రి
ఉస్మాన్‌ఖాన్ అలియాస్ నావెద్ సజీవంగా భద్రతాదళాలకు దొరికాడని అతడి తండ్రి యాకుబ్ ఖాన్‌కు తెలిసింది. విచారణలో నావెద్ ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేసినప్పుడు అతడి తండ్రి యాకుబ్ ఖాన్ ఫోన్ ఎత్తారు. ఫైసలాబాద్‌లోని ఆయన పంజాబీ భాషలో మాట్లాడుతూ యాకుబ్ ఖాన్ తన కుమారుడని, క్షమించి వదిలి వేయాలని వేడుకున్నాడు. లష్కర్ ఎ తొయిబా నావెద్ చనిపోవాలని కోరుకుందని చెప్పాడు. అయితే తమ కుమారుడు సజీవంగా పట్టుబడటంపై ఆయన ఒకరకంగా సంతోషం వ్యక్తం చేశాడు. లష్కర్ కుట్రలకు […]
Advertisement
ఉస్మాన్‌ఖాన్ అలియాస్ నావెద్ సజీవంగా భద్రతాదళాలకు దొరికాడని అతడి తండ్రి యాకుబ్ ఖాన్‌కు తెలిసింది. విచారణలో నావెద్ ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేసినప్పుడు అతడి తండ్రి యాకుబ్ ఖాన్ ఫోన్ ఎత్తారు. ఫైసలాబాద్‌లోని ఆయన పంజాబీ భాషలో మాట్లాడుతూ యాకుబ్ ఖాన్ తన కుమారుడని, క్షమించి వదిలి వేయాలని వేడుకున్నాడు. లష్కర్ ఎ తొయిబా నావెద్ చనిపోవాలని కోరుకుందని చెప్పాడు. అయితే తమ కుమారుడు సజీవంగా పట్టుబడటంపై ఆయన ఒకరకంగా సంతోషం వ్యక్తం చేశాడు. లష్కర్ కుట్రలకు తాము బలిపశువులమైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి. నావెద్ తన కుమారుడేనని, అతడిని కన్న దురదృష్టవంతుడిని తానేనని అన్నాడు. ఫైసలాబాద్‌కు మీడియా ప్రతినిధులు ఫోన్ చేసి వివరాలడగగా ఫోన్‌లో మాట్లాడేందుకు ఆయన భయపడిపోయాడు. తనను పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ఎ తొయిబా వెంటాడుతున్నాయన్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. జమ్ముకాశ్మీర్ ఉధంపూర్‌లో పట్టుబడిన ఉగ్రవాది నావెద్ తమ జాతీయుడు కాదని పాకిస్థాన్ బుకాయించినా అతడి తండ్రి యాకుబ్ ఖాన్ మాటల్లో మాత్రం భారత్ వాదనతో నిజమని తేలుస్తోంది. కాగా ఉస్మాన్ కూడా తాను పాక్ జాతీయుడనేనని, తమది పైసలాబాద్ అని విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Advertisement