మరుగుదొడ్డి లేకపోతే ఎన్నికల్లో పోటీకి అనర్హులు
బీహార్ లో మరుగుదొడ్డి `పంచాయతీ` ఎన్నికల్లో పోటీకి కొన్ని నిబంధనలున్నాయి. ఏదైనా నేరం రుజువై శిక్ష పడినా, ముగ్గురు పిల్లలున్నా,ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా పోటీకి అనర్హులుగా పరిగణిస్తారు. వీటితోపాటు ఇంకా చాలా నిబంధనలే ఉన్నాయి. వీటన్నింటికి భిన్నమైన కొత్త నిబంధనను రూపొందించింది బీహార్. ఈ నిబంధన ఆశ్చర్యపరిచినా ఆలోచింపజేసేదిగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాలని బీహార్ అసెంబ్లీ చట్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మరుగుదొడ్డి తమ ఇంట్లో […]
Advertisement
బీహార్ లో మరుగుదొడ్డి 'పంచాయతీ'
ఎన్నికల్లో పోటీకి కొన్ని నిబంధనలున్నాయి. ఏదైనా నేరం రుజువై శిక్ష పడినా, ముగ్గురు పిల్లలున్నా,ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా పోటీకి అనర్హులుగా పరిగణిస్తారు. వీటితోపాటు ఇంకా చాలా నిబంధనలే ఉన్నాయి. వీటన్నింటికి భిన్నమైన కొత్త నిబంధనను రూపొందించింది బీహార్. ఈ నిబంధన ఆశ్చర్యపరిచినా ఆలోచింపజేసేదిగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఇళ్లలో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాలని బీహార్ అసెంబ్లీ చట్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు మరుగుదొడ్డి తమ ఇంట్లో ఉన్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మరుగుదొడ్డి ఉన్నవాళ్లు మాత్రమే పోటీకి అర్హులుగా పేర్కొనే నిబంధనను బీహార్ పంచాయతీరాజ్(సవరణ) బిల్లు 2015 లో చేర్చారు. ఈ బిల్లు మూజువాణీ ఓటుతో బుధవారం ఆమోదం పొందింది.
టాయ్‌లెల్ ఉంటే నో టులెట్
పల్లె ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ పంచాయతీ కార్యాలయం. రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఎలాగో, పంచాయతీకి సర్పంచ్ అంతే. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోషించే పాత్రను పంచాయతీ సమావేశాల్లో వార్డు సభ్యులు పోషిస్తారు. ఆఫ్ర్టాల్ ఒక మరుగుదొడ్డి కోసం పోటీ చేయకుండా ఎవరైనా ఆగగలరా? పదవులకు దూరం కాగలరా? అందుకే సొంత ఇళ్లయితే మరుగుదొడ్డి కట్టుకుంటారు. అద్దె ఇంటిలో మరుగుదొడ్డి ఉంటే ఇక ఖాళీ చేయనే చేయరు. బీహార్ పల్లె ఇళ్లలో టాయ్‌లెట్ ఉంటే ఇక నో టులెట్ బోర్డన్న మాట.
Advertisement