ఆగస్ట్ 15 నుంచి గ్రేటర్‌లో షీ ట్యాక్సీలు
షీ ట్యాక్సీలు త్వరలో రోడ్డెక్కనున్నాయి. పంద్రాగస్టు కానుకగా ఈనెల 15 నుంచి మహిళా ప్రయాణికులకు షీ ట్యాక్సీలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తేనుందని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. మొదట విడతగా 12 ట్యాక్సీలు, మరో విడతలో 50 ట్యాక్సీలను నడుపుతామని మంత్రి చెప్పారు. 100 షీ ట్యాక్సీల నడపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా.. ఆ స్థాయిలో మహిళా డ్రైవర్లు లేకపోవడంతో విడతల వారీగా లక్ష్యం మేరకు షీ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరణ ఇచ్చారు. షీ […]
Advertisement
షీ ట్యాక్సీలు త్వరలో రోడ్డెక్కనున్నాయి. పంద్రాగస్టు కానుకగా ఈనెల 15 నుంచి మహిళా ప్రయాణికులకు షీ ట్యాక్సీలను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తేనుందని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. మొదట విడతగా 12 ట్యాక్సీలు, మరో విడతలో 50 ట్యాక్సీలను నడుపుతామని మంత్రి చెప్పారు. 100 షీ ట్యాక్సీల నడపాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా.. ఆ స్థాయిలో మహిళా డ్రైవర్లు లేకపోవడంతో విడతల వారీగా లక్ష్యం మేరకు షీ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరణ ఇచ్చారు. షీ ట్యాక్సీల కోసం గతేడాది 18 మంది మహిళలకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వీరిలో 12 మందిని ఎంపిక చేసి 12 ట్యాక్సీలను అప్పగించనున్నారు. ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళల కోసం షీ ట్యాక్సీలు ఉపయోగపడనున్నాయి. షీ ట్యాక్సీలను సులువుగా గుర్తించేదుకు వీలుగా తెలుగు, గులాబీ రంగు మారుతీ డిజైర్ వీడీఐ కార్లను ఎంపికచేశారు.
Advertisement