తహసిల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ
ఇసుక మాఫియా దాడిలో గాయాల పాలైన ముసునూరు తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వచ్చింది. ముసునూరు నుంచి బదిలీ చేయించుకొని వెళ్లకపోతే చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు లేఖ రాశారు. కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయబోమని దుండుగులు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే చంపేయడానికి రెండుసార్లు రెక్కీ నిర్వహించామని, పది రోజుల్లో బదిలీ చేయించుకుని ఊరు విడిచి వెళ్ళకపోతే హతమార్చడం ఖాయమని హెచ్చరించారు. దీనిపై వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేర లేఖను స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. […]
Advertisement
ఇసుక మాఫియా దాడిలో గాయాల పాలైన ముసునూరు తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వచ్చింది. ముసునూరు నుంచి బదిలీ చేయించుకొని వెళ్లకపోతే చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు లేఖ రాశారు. కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయబోమని దుండుగులు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే చంపేయడానికి రెండుసార్లు రెక్కీ నిర్వహించామని, పది రోజుల్లో బదిలీ చేయించుకుని ఊరు విడిచి వెళ్ళకపోతే హతమార్చడం ఖాయమని హెచ్చరించారు. దీనిపై వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేర లేఖను స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ లేఖపై ‘సిటీఎంపి’ అని చివర రాసి ఉంది. ‘సిటీఎంపీ’ అంటే చింతమనేని ప్రభాకర్ అని కొంతమంది అంటుండగా, ఇంత రాద్దాంతం జరిగిన తర్వాత ఆయన అయి ఉండకపోవచ్చని కొంతమంది అంటున్నారు. కృష్ణా జిల్లా ముసునూరులో ఇసుక దందా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులు ఈమెపై దాడికి పాల్పడిన సంఘటనలో ఇంకా దర్యాప్తు జరుగుతుండగానే ఇలా బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళడం, ఇరు పక్షాలతో మాట్లాడిన తర్వాత విచారణ కమిటీ వేయడం జరిగింది. ముసునూరు మండలంలో ఇసుక మాఫియా ఎక్కువగా ఉందని, దాన్ని అడ్డుకున్నందుకే బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన లేఖతో తాను భయపడడం లేదని, బెదిరింపులకు భయపడి బదిలీ చేయించుకుని పారిపోనని, ఇక్కడే ఉద్యోగం చేస్తానని ఆమె ధీమాగా చెప్పారు.
Advertisement