అమిత్‌సింగ్ ను చిత‌క‌బాదిన ఖైదీలు?

వ‌న‌స్థ‌లిపురంలో ప్రేమ‌పేరుతో దాడి చేసి అక్కాచెల్లెళ్లు  శ్రీలేఖ, యామినిల‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేసిన అమిత్‌సింగ్ ప్ర‌స్తుతం తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్నాడు. అయిదు రోజుల క‌స్ట‌డీ కోసం శుక్ర‌వారం చ‌ర్ల‌ప‌ల్లి నుంచి తీసుకు వ‌చ్చిన  చైత‌న్య‌పురి పోలీసులు  అమిత్‌సింగ్‌ను సాయంత్ర‌మే తిరిగి కారాగారానికి పంపడం చ‌ర్చానీయాంశంగా మారింది. అత‌ని శ‌రీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అక్కాచెల్లెళ్ల‌ను కిరాక‌తంగా హ‌త‌మార్చ‌డంపై ఆగ్ర‌హంతో తోటిఖైదీలే చిత‌క‌బాదార‌ని స‌మాచారం. పోలీసులు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించ‌డం లేదు. మ‌రోవైపు చ‌ర్ల‌ప‌ల్లి కారాగారం […]

Advertisement
Update:2015-08-01 05:26 IST
వ‌న‌స్థ‌లిపురంలో ప్రేమ‌పేరుతో దాడి చేసి అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామినిల‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేసిన అమిత్‌సింగ్ ప్ర‌స్తుతం తీవ్ర అస్వ‌స్థ‌తో ఉన్నాడు. అయిదు రోజుల క‌స్ట‌డీ కోసం శుక్ర‌వారం చ‌ర్ల‌ప‌ల్లి నుంచి తీసుకు వ‌చ్చిన చైత‌న్య‌పురి పోలీసులు అమిత్‌సింగ్‌ను సాయంత్ర‌మే తిరిగి కారాగారానికి పంపడం చ‌ర్చానీయాంశంగా మారింది. అత‌ని శ‌రీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అక్కాచెల్లెళ్ల‌ను కిరాక‌తంగా హ‌త‌మార్చ‌డంపై ఆగ్ర‌హంతో తోటిఖైదీలే చిత‌క‌బాదార‌ని స‌మాచారం. పోలీసులు ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించ‌డం లేదు. మ‌రోవైపు చ‌ర్ల‌ప‌ల్లి కారాగారం అధికారులు మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తున్నారు. విచార‌ణ సంద‌ర్భంగా అమిత్‌సింగ్ అస‌లు నోరు తెర‌వ‌లేదు. ప్ర‌శ్నించిన ప్ర‌తిసారీ.. శ్రీ‌లేఖ ఆత్మ‌తో మాట్లాడాల‌ని ఉందంటూ చెప్ప‌డంతో పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. దీంతో చేసేది లేక క‌స్ట‌డీ ముగియ‌కున్నా తిరిగి జైలుకే పంపిన‌ట్లు స‌మాచారం.
Tags:    
Advertisement

Similar News