విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై చేతులెత్తేసిన కేంద్రం

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై కేంద్రం చేతులెత్తేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎలాంటి పరిష్కారం చూపించలేని స్థితిలో కేంద్రం  కోర్టులోనే ఈ అంశాన్నితేల్చుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో ఇక ఆంద్రప్రదేశ్‌కు చెందిన విద్యుత్‌ ఉద్యోగులకు న్యాయాన్యాయాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి హైకోర్టు మీదే పడింది. ఈ అంశాన్ని చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్రం సూచనల మేరకు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించిన ఉభయ సీఎస్‌లు […]

Advertisement
Update:2015-07-31 08:49 IST
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై కేంద్రం చేతులెత్తేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎలాంటి పరిష్కారం చూపించలేని స్థితిలో కేంద్రం కోర్టులోనే ఈ అంశాన్నితేల్చుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో ఇక ఆంద్రప్రదేశ్‌కు చెందిన విద్యుత్‌ ఉద్యోగులకు న్యాయాన్యాయాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి హైకోర్టు మీదే పడింది. ఈ అంశాన్ని చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్రం సూచనల మేరకు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించిన ఉభయ సీఎస్‌లు ఎవరికి వారే పైచేయిగా ఉండాలన్న ధోరణితో వ్యవహరించారు. దాంతో ఈ సమస్యకు పరిష్కారం సూచించడం తమ వల్ల కాదని కోర్టులోనే తేల్చుకోవాలని కేంద్రం తేల్చి చెప్పేసింది. కాగా ఏపీ మూలాలున్న1259 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ జూన్‌ 9న తెలంగాణ ఇంధన శాఖ ఆదేశాలిచ్చింది. ఇది అన్యాయమంటూ రిలీవ్‌ అయిన ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య సమక్షంలో రాజ్‌నాథ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఒకేసారి 1259 మంది ఉద్యోగులను తొలగించడమేమిటని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఈఅంశాన్ని దృష్టిలో పెట్టుకుంటామని, తప్పనిసరిగా న్యాయం చేస్తామని రిలీవైన ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చించడానికి 31వ తేదీ ఉదయుం 11 గంటలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇంధన కార్యదర్శులు, సీఎండీలు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంముంత్రిత్వ శాఖ సంబంధితులకు లేఖలు రాసింది. దీన్ని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కేంద్రంతో చర్చలు జరపడానికి వెళ్ళారు. కాని ఈ చర్చలు ఫలవంతం కాలేదు. ఇప్పటికే హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరిస్తూ… జూన్‌ నెల జీతాలు తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. ఇపుడు 1259 మంది ఉద్యోగుల భవిష్యత్‌ హైకోర్టు తదుపరి ఇచ్చే తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది.
Tags:    
Advertisement

Similar News