విశాఖలో పంద్రాగ‌స్టు వేడుకలకు క‌స‌ర‌త్తు పూర్తి ...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఈసారి విశాఖ‌ప‌ట్నం వేదిక కాబోతోంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాత్కాలిక రాజధాని విజయవాడలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి విశాఖ పట్నం రామకృష్ణా బీచ్‌ రోడ్డును ఈ వేడుకలకు వేదికగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖప ట్నం జిల్లా కలెక్టర్‌ ఎన్‌ యువరాజ్‌, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముఖేష్‌ […]

Advertisement
Update:2015-07-30 08:32 IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌కు ఈసారి విశాఖ‌ప‌ట్నం వేదిక కాబోతోంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాత్కాలిక రాజధాని విజయవాడలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి విశాఖ పట్నం రామకృష్ణా బీచ్‌ రోడ్డును ఈ వేడుకలకు వేదికగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖప ట్నం జిల్లా కలెక్టర్‌ ఎన్‌ యువరాజ్‌, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నండూరి సాంబశివరావు, ఐజీ హరీష్ కుమార్‌ గుప్తా, సమాచారశాఖ కమిషనర్‌ ఎన్వీ రమణారెడ్డి దీనికి హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ ఐజీ ఆర్కే మీనాకు అప్పగించారు. ప‌తాక వందనం కార్యక్రమానికి లైజనింగ్‌ అధికారిగా డిప్యూటీ కమిషనర్‌ సీఎం త్రివిక్ర మ వర్మను నియమించారు. విశాఖప ట్నంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్కే బీచ్‌కు దారి తీసే మార్గాలను వెంటనే మరమ్మతు చేయాల్సిందిగా ఐవైఆర్‌ కృష్ణారావు రోడ్లు-భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. దీనితోపాటు ప్రముఖ కట్టడాలు, భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. వేడుకల సందర్భంగా ప్రదర్శించబోయే వివిధ శాఖల నమూనాలతో కూడిన శకటాల వెంటనే ఎంపిక చేయాలని సూచించారు.
Tags:    
Advertisement

Similar News