పంజాబ్‌లో ఉగ్ర దాడి వెనుక పాక్ హస్తం!
ఉగ్రవాదులు గురుదాస్‌పురా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి పంజాబ్ స్పెషల్ యూనిట్లకు చెందిన పోలీసులను హత్య చేయడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి పోలీసు అధికారులపై కాల్పులకు తెగబడిన ముగ్గురు ముష్కరులతో భారత సైనికులు 11 గంటల పాటు పోరాడి వారిని మట్టుబెట్టారు. చనిపోయిన ముష్కరుల వద్ద నుంచి జీపీఎస్ సెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ జీపీఎస్‌ను పరిశీలించిన అధికారులు ముష్కరులు పాక్ అండదండలతో షకారాగర్హ్ […]
Advertisement
ఉగ్రవాదులు గురుదాస్‌పురా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి పంజాబ్ స్పెషల్ యూనిట్లకు చెందిన పోలీసులను హత్య చేయడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చి పోలీసు అధికారులపై కాల్పులకు తెగబడిన ముగ్గురు ముష్కరులతో భారత సైనికులు 11 గంటల పాటు పోరాడి వారిని మట్టుబెట్టారు. చనిపోయిన ముష్కరుల వద్ద నుంచి జీపీఎస్ సెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ జీపీఎస్‌ను పరిశీలించిన అధికారులు ముష్కరులు పాక్ అండదండలతో షకారాగర్హ్ నుంచి ఆదివారం ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేశించి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని నిర్ధారణకు వచ్చారు. ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతాల్లో చొరబడి బామియాల్ టౌన్‌కు చేరుకున్నారు. జమ్మూ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో అక్కడ నుంచి ఇండో పాక్ సరిహద్దులకు 12 కిమీ దూరం ఉన్న దీనానగర్‌కు వచ్చారని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదుల వద్ద ఏకె 47 ఆటోమేటిక్ మెషిన్‌గన్లు, చైనా తయారు చేసిన హ్యాండ్ గ్రనేడ్లు లభించాయని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ తెలిపారు.
Advertisement