విజయవాడకు ప్రధాన శాఖల తరలింపు
ఆగస్టు పూర్తయ్యే నాటికి ప్రధాన శాఖలను విజయవాడకు తరలించాలని అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవిన్యూ, వ్యవసాయం, హౌసింగ్, ఫైనాన్స్, మైనింగ్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 20 కీలక శాఖలను త్వరలో విజయవాడ తరలించాలని, అక్కడ నుంచే పరిపాలన ప్రారంభించాలని సూచించారు. అధికారులు విజయవాడలో ఉండేందుకు మానసికంగా సిద్ధమయ్యే వరకు అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు పని […]
Advertisement
ఆగస్టు పూర్తయ్యే నాటికి ప్రధాన శాఖలను విజయవాడకు తరలించాలని అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవిన్యూ, వ్యవసాయం, హౌసింగ్, ఫైనాన్స్, మైనింగ్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 20 కీలక శాఖలను త్వరలో విజయవాడ తరలించాలని, అక్కడ నుంచే పరిపాలన ప్రారంభించాలని సూచించారు. అధికారులు విజయవాడలో ఉండేందుకు మానసికంగా సిద్ధమయ్యే వరకు అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు పని చేసే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు.
Advertisement