ఆగస్టులో ఉస్మానియాకు రాహుల్ ?
సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించి తెలుగు రాష్ట్రాల్లో జీవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊపిరి పోసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీనే రంగంలోకి దిగారు. తెలుగురాష్ట్రాల్లోఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించారు. రాహుల్ పర్యటనతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న క్యాడర్ ఈసారి విద్యార్ధి నాయకులతో రాహుల్‌ను మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆగస్టు 2వ వారంలో రాహుల్‌గాంధీ ఉస్మానియా […]
Advertisement
సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించి తెలుగు రాష్ట్రాల్లో జీవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊపిరి పోసుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీనే రంగంలోకి దిగారు. తెలుగురాష్ట్రాల్లోఆత్మహత్య లు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పర్యటించారు. రాహుల్ పర్యటనతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న క్యాడర్ ఈసారి విద్యార్ధి నాయకులతో రాహుల్‌ను మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆగస్టు 2వ వారంలో రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధి సంఘాలతో భేటి అయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు రాహుల్ పర్యటనపై ఉస్మానియా విద్యార్ధి సంఘాలతో చర్చించారు. నిరుద్యోగుల సమస్యలపై యూనివర్శిటీలో నిర్వహించే సభలో రాహుల్ పాల్గొనాలని వారు కోరినట్లు తెలుస్తోంది. మరి వీరి కోరికను రాహుల్ మన్నిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.
Advertisement