చలసాని ప్రసాద్ కన్నుమూత...

ప్రముఖ సాహితీవేత్త, విరసం నేత, జీవితాంతం పౌరహక్కుల కోసం పోరాడిన చలసాని ప్రసాద్ (83) శనివారం ఉదయం విశాఖలో కన్నుమూసారు.. చలసాని ప్రసాద్ లెక్చరర్ గా పదవీ విరమణ చేసారు. ప్రసాద్ మంచి చరిత్రకారుడు. శ్రీకాకుళ‌ ఉద్యమ చరిత్రతో ప్రసాద్ కు దాదాపు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇటీవల వెలుబడిన కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర  రచనల సంకలనాలకు సంపాదకత్వం వహించారు. శ్రీశ్రీ సాహిత్య సర్వస్వాన్నీ వెలువరించారు. కృష్ణా జిల్లాలో జన్మించిన చలసాని ఉద్యోగరీత్యా విశాఖ వెళ్ళినా విశాఖతో […]

Advertisement
Update:2015-07-25 06:59 IST

ప్రముఖ సాహితీవేత్త, విరసం నేత, జీవితాంతం పౌరహక్కుల కోసం పోరాడిన చలసాని ప్రసాద్ (83) శనివారం ఉదయం విశాఖలో కన్నుమూసారు.. చలసాని ప్రసాద్ లెక్చరర్ గా పదవీ విరమణ చేసారు. ప్రసాద్ మంచి చరిత్రకారుడు. శ్రీకాకుళ‌ ఉద్యమ చరిత్రతో ప్రసాద్ కు దాదాపు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇటీవల వెలుబడిన కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర రచనల సంకలనాలకు సంపాదకత్వం వహించారు. శ్రీశ్రీ సాహిత్య సర్వస్వాన్నీ వెలువరించారు. కృష్ణా జిల్లాలో జన్మించిన చలసాని ఉద్యోగరీత్యా విశాఖ వెళ్ళినా విశాఖతో ఆయన అనుబంధం విడదీయరానిది. ఆయన మరణం తెలుగు సాహిత్యలోకానికి, అభ్యుదయ ఉద్యమాలకు, విరసానికి తీరని లోటు.

Tags:    
Advertisement

Similar News