దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోకుండా కమిటీలా?
నగరి ఎమ్మెల్యే రోజా విమర్శ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా విమర్శించారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో మహిళా తహసిల్దార్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడితే తహసీల్దార్‌దే తప్పని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. డ్వాక్రా మహిళలకు కేటాయించిన ఇసుక రీచ్‌ల వద్ద ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లకు పనేమిటని ఆమె ప్రశ్నించారు. మహిళల […]
Advertisement
నగరి ఎమ్మెల్యే రోజా విమర్శ
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా విమర్శించారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో మహిళా తహసిల్దార్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడితే తహసీల్దార్‌దే తప్పని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. డ్వాక్రా మహిళలకు కేటాయించిన ఇసుక రీచ్‌ల వద్ద ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లకు పనేమిటని ఆమె ప్రశ్నించారు. మహిళల పేరుతో అధికారపార్టీ నాయకులే ఇసుక దందాకు పాల్పడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్న ఎమ్మెల్యే చింతమనేనిని అడ్డుకున్న మహిలా తహసీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడినా ఇంత వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఐఎఎస్ అధికారితో కమిటీ వేస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ అధికారితోనైనా కమిటీ వేసి నివేదిక ఇవ్వమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తారా అని రోజా ప్రశ్నించారు. చిత్తూరు జిలా్ల చిన్న గొట్టిగల్లు మండలంలో ఎస్సీ మహిళా తహసీల్దార్ నారాయణమ్మపై టీడీపీకి చెందిన సర్పంచ్ దాడికి పాల్పడినా చర్యలు తీసుకోలేదని రోజా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై యాసిడ్ దాడులు, విద్యార్థినుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement