సంక్షేమ హాస్టళ్లలో సర్కార్ మెనూ రెడీ
ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు 2015-16 సంవత్సరానికి మెనూ చార్ట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఇదే మెనూను అమలు చేయాలని, అయితే, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష జరిపి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని సూచించింది. కొత్త విధానం ప్రకారం ఒక్కో విద్యార్ధికి బియ్యం 400 గ్రాములు, పామాయిల్, పప్పులు, ఉప్పు, చింతపండు, కోడిగుడ్లు, పండ్లు, స్వీట్లు ఇతరాలు […]
Advertisement
ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు 2015-16 సంవత్సరానికి మెనూ చార్ట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఇదే మెనూను అమలు చేయాలని, అయితే, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష జరిపి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని సూచించింది. కొత్త విధానం ప్రకారం ఒక్కో విద్యార్ధికి బియ్యం 400 గ్రాములు, పామాయిల్, పప్పులు, ఉప్పు, చింతపండు, కోడిగుడ్లు, పండ్లు, స్వీట్లు ఇతరాలు కలుపుకుని నెలకు రూ. 850 వంతున, చిన్న క్లాసుల విద్యార్ధులకు రూ. 750 వంతున అంచనా వేశారు. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్ధులకు రోజుకు ఒక్కొక్కరికి రూ. 35 చొప్పున నెలకు రూ. 1,050 అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు రాగిమాల్ట్ (పాలతో), అల్పాహారంగా ఉప్మా, కిచిడీ, పులిహోర, ఇడ్లీతో పాటు ఏదేని ఒక పండు ఇవ్వాలి. స్కూళ్లలోనే మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నందున ఆదివారం మధ్యాహ్నం మాత్రం రైతాతో పాటు ఎగ్ బిరియానీ ఇవ్వాలి. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో ఉదయం 6.30 గంటలకు తేనీరు, టిఫిన్‌గా ఉప్మా చెట్నీ, కిచిడీ చెట్నీ,పులిహోర, టమాటారైస్, పులగం వంటివి ఇవ్వాలి. మధ్యాహ్న భోజనం కింద అన్నం, సాంబారు, ఆకుకూరలు ఆదివారాలు పెరుగుపచ్చడితో పాటు ఎగ్ బిరియానీ ఉంటుంది. ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. రాత్రి భోజనంలో ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కోడిగుడ్డు ఉండాలి.
Advertisement