ముదురుతున్నమాటల యుద్ధం!
తలసాని రాజీనామా విషయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రిగా కొనసాగే అర్హత లేదని షబ్బీర్ చేసిన విమర్శలకు ఇటీవల తలసాని ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. నా జోలికి వస్తే షబ్బీర్ అలీ బాగోతాలను బయటపెడతానంటూ తలసాని హెచ్చరించారు! దీనిపై షబ్బీర్ అలీ కూడా ధీటుగానే స్పందించారు. తాను చేసిన అక్రమాలు ఏంటో తలసాని బయటపెట్టాలని సవాలు విసిరారు. ఈ […]
Advertisement
తలసాని రాజీనామా విషయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రిగా కొనసాగే అర్హత లేదని షబ్బీర్ చేసిన విమర్శలకు ఇటీవల తలసాని ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. నా జోలికి వస్తే షబ్బీర్ అలీ బాగోతాలను బయటపెడతానంటూ తలసాని హెచ్చరించారు! దీనిపై షబ్బీర్ అలీ కూడా ధీటుగానే స్పందించారు. తాను చేసిన అక్రమాలు ఏంటో తలసాని బయటపెట్టాలని సవాలు విసిరారు. ఈ విషయంపై ఎక్కడ చర్చకు రమ్మన్నా తాను సిద్ధమేనని షబ్బీర్ స్పష్టం చేశారు. తలసాని ఓ దొంగమంత్రి అని వ్యంగ్యంగా సంబోధించారు. కొంతకాలంగా తలసాని రాజీనామాపై టీడీపీతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తలసాని ప్రెస్‌మీట్ పెట్టి అన్నిపార్టీల నాయకులను, వారి విధానాలను తూర్పారబట్టారు. అయితే షబ్బీర్ అలీ మాత్రమే ఇప్పటిదాకా తలసాని వ్యాఖ్యలపై ధీటుగా స్పందిస్తూ వస్తున్నారు.
Advertisement