పొన్నాలను లైట్ తీసుకున్న టీపీసీసీ

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వరంగల్ లోక్‌సభ స్థానానికి త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)మంగళవారం గాంధీభవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన జిల్లాకు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు మాత్రం ఆహ్వానం అందకపోవడం వివాదాస్పదమైంది. ఈ […]

Advertisement
Update:2015-07-22 06:11 IST
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వరంగల్ లోక్‌సభ స్థానానికి త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)మంగళవారం గాంధీభవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన జిల్లాకు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు మాత్రం ఆహ్వానం అందకపోవడం వివాదాస్పదమైంది. ఈ సంఘటనపై పొన్నాల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ వ్యవహారశైలిపై ఆయన మద్దతుదారులు నిప్పులు చెరుగుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఆయనకు పార్టీ ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. పొన్నాలకు ఆహ్వానం అందలేదనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేయడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వెంటనే స్పందించారు. పొన్నాలకు ఫోన్ చేసి రావాలని ఆహ్వానించారు. అయితే ఉత్తమ్ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాకుండా గట్టిగానే నిలదీసినట్లు సమాచారం.
Tags:    
Advertisement

Similar News