తప్పంతా వనజాక్షిదేనట: ఇది కేబినెట్ మాట
ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చింతమనేనికి ఏపీ కేబినెట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. తప్పంతా తహశీల్దార్ వనజాక్షిదేనని కేబినెట్ తేల్చింది. ఇసుక మాఫీయా బరి తెగించి ముసునూరు తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ఇతర ప్రభుత్వ సిబ్బందిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇతర సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ అంశంపై దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల […]
Advertisement
ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చింతమనేనికి ఏపీ కేబినెట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. తప్పంతా తహశీల్దార్ వనజాక్షిదేనని కేబినెట్ తేల్చింది. ఇసుక మాఫీయా బరి తెగించి ముసునూరు తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ఇతర ప్రభుత్వ సిబ్బందిపై దాడి చేశారు. ఈ సంఘటనలో తహసిల్దారు వనజాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇతర సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ అంశంపై దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు సీఎం చంద్రబాబు ఓ ఐఎఎస్‌తో కమిటీని కూడా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాలన్నీ ఇపుడు గాలికి కొట్టుకుపోయాయి. తప్పంతా తహసిల్దారు వనజాక్షిదేనని తేల్చేశారు. కేబినెట్‌లో ఈ నిర్ణయం జరిగాక ఆ అంశంపై విచారణ కమిటీ ఎందుకేసినట్టు? ఎవరిని సంతృప్తి పరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు? ఉద్యోగులంటే… అందులోనూ మహిళా ఉద్యోగులంటే ఇంత తేలిక భావం ప్రభుత్వానికి ఉండడం జనం ఆలోచించాల్సిన అంశమే.
Advertisement