పుష్కరాల ముగింపు రోజు ప్రతి ఇంట్లో దీపారాదన!

పుష్కరాల ముగింపు రోజైన 25న ప్రతీ ఇంట్లో దీపారాధాన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పుష్కరాల కోసం పనిచేసిన వివిధ విభాగాలకు ఈనెల 26న అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధురవాడలో ఐటీ కంపెనీకి 300 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో డీఆర్‌డీవో ఏర్పాటుకు 2000 ఎకారాలు ఇచ్చేందుకు […]

Advertisement
Update:2015-07-22 11:30 IST
పుష్కరాల ముగింపు రోజైన 25న ప్రతీ ఇంట్లో దీపారాధాన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పుష్కరాల కోసం పనిచేసిన వివిధ విభాగాలకు ఈనెల 26న అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధురవాడలో ఐటీ కంపెనీకి 300 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో డీఆర్‌డీవో ఏర్పాటుకు 2000 ఎకారాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఉదయం కేబినెట్‌ ప్రారంభంకాగానే రాజమండ్రి తొక్కిసలాట మృతులకు మంత్రులు సంతాపం తెలిపారు. కాలి శస్త్ర చికిత్స కారణంగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ సమావేశానికి హాజరుకాలేదు.
Tags:    
Advertisement

Similar News