ఇల్లు రాసివ్వలేదని భార్యాబిడ్డల సజీవ దహనం
భార్యను కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను అదే అగ్నికి ఆహుతి చేశాడు. ఆమెతోపాటు ఆమెకు పుట్టిన బిడ్డను కూడా సజీవ దహనం చేశాడు. భార్య అమ్మమ్మకు చెందిన ఇల్లు తన పేరిట రాసివ్వనందుకు ఆగ్రహించి మానవ మృగంగా మారి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతోపాటు ఎనిమిది మాసాల బిడ్డపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. అడ్డొచ్చిన ఆమె అమ్మమ్మనూ అదే రీతిలో కడతేర్చ డానికి ప్రయత్నించాడు. […]
Advertisement
భార్యను కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను అదే అగ్నికి ఆహుతి చేశాడు. ఆమెతోపాటు ఆమెకు పుట్టిన బిడ్డను కూడా సజీవ దహనం చేశాడు. భార్య అమ్మమ్మకు చెందిన ఇల్లు తన పేరిట రాసివ్వనందుకు ఆగ్రహించి మానవ మృగంగా మారి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతోపాటు ఎనిమిది మాసాల బిడ్డపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. అడ్డొచ్చిన ఆమె అమ్మమ్మనూ అదే రీతిలో కడతేర్చ డానికి ప్రయత్నించాడు. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ ఘటన జనంలో కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లా ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఆకుల రాజేంద్రప్రసాద్(28)తో చిట్టినగర్‌కు చెందిన రోజాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తల్లిదండ్రులు లేని రోజా బాధ్యతలను చూస్తున్న ఆమె అమ్మమ్మ వెంకటమ్మ.. పసుపుకుంకాల కింద రూ.5 లక్షల కట్నం, లాంఛనాలను ఇచ్చింది. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ వెంకటమ్మ పేరిట ఉన్న ఇల్లు కూడా కావాలని చాలాకాలం నుంచి ఒత్తిడి చేస్తున్నాడు. అమ్మమ్మ వద్దకు ప్రసవానికి వచ్చిన రోజా ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఆమె వద్దకు వెళ్లి ఇంటి విషయమై గొడవ పడ్డాడు. వారిద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఆగ్రహించిన రాజేంద్రప్రసాద్ తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను భార్య, కుమారునితోపాటు అడ్డుగా వచ్చిన వెంకటమ్మపైనా పోసి నిప్పంటించాడు. దీంతో వారు మంటలతో అరుచుకుంటూ బైటకొచ్చి పడిపోయారు. ఈ సంఘటనలో పాక్షికంగా గాయపడిన రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతు రోజా, ఆమె బిడ్డ మృతి చెందారు. వృద్ధురాలి పరిస్థతి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Advertisement