రాహుల్ డైపర్ మార్చుకునే పిల్లాడు: బీజేపీ
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌పై బీజేపీ విరుచుకుపడింది. మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లాడి స్థితికి నిదర్శనమని ఎద్దేవా చేసింది. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగడుతున్న రాహుల్ మోదీపై విమర్శలు పెంచారు. భూసేకరణ బిల్లు విషయంలో మోదీని ప్రజలు వ్యతిరేకిస్తారని, ఆరునెలల్లో 56 అంగుళాల మోదీ ఛాతిని, 5.6 అంగుళాలకు తగ్గిస్తారని ఎగతాళి చేసిన విషయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ చిన్నపిల్లాడి మనస్తత్వం నుంచి బయటికిరావాలని, డైపర్లు మార్చుకునే పిల్లాడిలామాట్లాడటం సమంజసం కాదని […]
Advertisement
కాంగ్రెస్ యువరాజు రాహుల్‌పై బీజేపీ విరుచుకుపడింది. మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లాడి స్థితికి నిదర్శనమని ఎద్దేవా చేసింది. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగడుతున్న రాహుల్ మోదీపై విమర్శలు పెంచారు. భూసేకరణ బిల్లు విషయంలో మోదీని ప్రజలు వ్యతిరేకిస్తారని, ఆరునెలల్లో 56 అంగుళాల మోదీ ఛాతిని, 5.6 అంగుళాలకు తగ్గిస్తారని ఎగతాళి చేసిన విషయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ చిన్నపిల్లాడి మనస్తత్వం నుంచి బయటికిరావాలని, డైపర్లు మార్చుకునే పిల్లాడిలామాట్లాడటం సమంజసం కాదని పేర్కొంది. ఆయన చిన్నపిల్లాడు కాకున్నా, ఆయన ప్రవర్తన డైపర్లుమార్చుకునే శిశువును గుర్తుకు చేస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యంగ్యంగా విమర్శించారు.
Advertisement