నకిలీ పాస్ పుస్తకాలపై 'సిట్' దర్యాప్తు ముమ్మరం
అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ధర్మవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌ల్లో ఒకేసారి శుక్రవారం సోదాలు నిర్వహించింది. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే రికార్డులన్నీ అప్పటికప్పుడు చూపడానికి బ్యాంకు సిబ్బంది అశక్తత వ్యక్తం చేయడంతో 22వ తేదీలోగా మొత్తం రికార్డులు తమకు సమర్పించాలని సిట్ సిబ్బంది ఆదేశించారు. […]
Advertisement
అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ధర్మవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌ల్లో ఒకేసారి శుక్రవారం సోదాలు నిర్వహించింది. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే రికార్డులన్నీ అప్పటికప్పుడు చూపడానికి బ్యాంకు సిబ్బంది అశక్తత వ్యక్తం చేయడంతో 22వ తేదీలోగా మొత్తం రికార్డులు తమకు సమర్పించాలని సిట్ సిబ్బంది ఆదేశించారు. కాగా గురువారం సిట్ అధికారులు తాడిపత్రిలో ఈ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసినట్టు ఆరోపణలున్న ఓ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడులు చేసి అక్కడ యంత్ర సామాగ్రిని, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఆ ప్రెస్‌ను సీజ్ చేశారు. మొత్తం మీద నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారానికి సంబంధించి సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసిందని చెప్పవచ్చు.
Advertisement