ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై చర్య తీసుకోండి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
తప్పుడు కథనాలతో తన పరువుకు భంగం కలిగించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ర్ట న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు నివేదించారు. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి చెరువు భూమిని కబ్జా చేశారంటూ గత ఫిబ్రవరిలో ఆంధ్రజ్యోతిలో, ఏబీఎన్ చానల్‌లో కథనాలు వచ్చాయి. ఈ రెండు కథనాలు నిరాధారమైనవని ఆంధ్రజ్యోతి, ఏబీఎస్ సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి అదే నెలలో కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను […]
Advertisement
తప్పుడు కథనాలతో తన పరువుకు భంగం కలిగించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ర్ట న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు నివేదించారు. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి చెరువు భూమిని కబ్జా చేశారంటూ గత ఫిబ్రవరిలో ఆంధ్రజ్యోతిలో, ఏబీఎన్ చానల్‌లో కథనాలు వచ్చాయి. ఈ రెండు కథనాలు నిరాధారమైనవని ఆంధ్రజ్యోతి, ఏబీఎస్ సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి అదే నెలలో కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా నాంపల్లి 17వ ఏసీఎంఎం కోర్టు గురువారం మంత్రి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా పత్రిక కథనంలో పేర్కొన్న స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించారు. పత్రికలో పేర్కొన్న సర్వే నంబర్ 2032లో ప్రభుత్వభూమి లేదని రెవెన్యూ అధికారులు నిర్ధారించినట్టు కోర్టుకు నివేదించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 16కు వాయిదా వేశారు.
Advertisement